నిర్బంధ అణచివేతలను వ్యతిరేకించాలి

ఇటీవల కాలంలో అరెస్టులను అణచివేతను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని లేనిపక్షంలో ప్రజాస్వామ్యమే ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదం ఉందని వామపక్ష విప్లవ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు ప్రజా చైతన్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అమిత్ షా, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అందరూ నేరస్తులే అన్నారు.

కళా సేవ రత్న అవార్డు ప్రదానం

స్కై ఫౌండేషన్ నిస్వార్థంగా నిరంతరం క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న సేవలను గుర్తించి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ సంస్థవాళ్ళు వై సంజీవ కుమార్ గారికి కళా సేవ రత్న అవార్డు ప్రకటించారు. విశ్రాంతి హై కోర్ట్ జస్టిస్ శ్రీ బి.చంద్రకుమార్ గారు, శ్రీ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు ( ఏ పి సాహిత్య అకాడమీ ఛైర్మెన్ ), శ్రీ లయన్ విజయ కుమార్ గారు జాతీయ చైర్మెన్, యన్.జి.ఓ నెట్ వర్క్ చేతులమీదగా కళా సేవ పురస్కార…

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

తెలంగాణలో టీ ఏస్ అర్ టీ సీ కి తెలంగాణ ప్రభుత్వానికి చర్చలు విఫలం కావడంతో శుక్రవారం నుంచి టీ ఏస్ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా తాత్కాలిక బస్ డ్రైవర్ , కండక్టర్ పోస్టులకు అప్లై చేసుకొనుటకు నోటిఫికేషన్ విడుదల చేసినది. అప్లై చేసుకొని అభ్యర్థులు ఆయా డిపో పరిధిలోని డిపో మేనేజర్లను ,తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లతో సంప్రదించగలరు.

ఆధార్- పాన్ కార్డుల లింక్ పెంపు

ఆధార్ కార్డు ని పాన్ కార్డు తో లింక్ చేసే గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఎన్ని సార్లు పెంచుతున్న అధిక సంఖ్యలో ఎవరు ఆధార్ ని లింక్ చేయడం లేదు. గడువు ఈ నెల 30న ముగుస్తుండడంతో మళ్లీ డిసెంబర్ 31 కి పొడిగించారు. లింక్ కోసం ఇన్ కమ్ టాక్స్ అధికారిక వెబ్సైట్ కి వెళ్లి లింక్ చేసుకోండి.

భవన కార్మిక సంఘాల ధర్నా

భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నినదించారు .ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగాని ప్రవీణ్ మాట్లాడుతూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో కార్మిక సమస్యల పైన లేబర్ ఆఫీసుల ముందు ఆందోళనలు చేస్తున్నామని అన్నారు. కార్మిక అడ్డాలకు…

తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణి

తెలంగాణ పల్లెటూర్లలో ప్రారంభమైన బతుకమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విశ్వవ్యాప్తం అయిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు . అంబర్పేట నియోజకవర్గం లోని మహారాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మంగళవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ,మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో…

కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు ఐక్యం కావాలి: ఎండీ గౌస్

MCPI,RMPI ల మూడు రోజులపాటు బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్లో జరిగిన సమావేశంలో రెండు పార్టీలు ఒకే పార్టీగా విలీనం అయినయని ప్రకటించారు. ఇందులో భాగంగా మతతత్వ, నియంతృత్వ శక్తులను ఒడించుటకు తక్షణమే కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు ఐక్యం కావాలని ఎం సీ పీ ఐ జాతీయ కార్యదర్శి ఎండీ గౌస్ పిలుపునిచ్చారు. పార్టీల వర్గ, కార్మిక, రైతు,మహిళ,యువజన సంఘాలు ఓకే సంఘంగా పని చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ జాతీయ రాజకీయ పరిణామాలను ఆర్థిక సంక్షోభం సమీక్షించి…

స్కై ఫౌండేషన్ అన్నదానం

దయనీయ స్థితులలో రోడ్ల పక్కన ఆకలితో అలమటిస్తూన్న ఎందరో అభాగ్యులకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ మాట్లాడుతూ దిక్కుమొక్కులేని వారికి ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టడమే మా ఫౌండేషన్ లక్ష్యం అన్నారు.ఈ ఆదివారం హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్, సంగీత్, ఆర్ టి సి క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి,గాంధీ హాస్పిటల్, చిలకలగూడ, ప్యారడైజ్, బాలానగర్, మెట్ట్టు గూడ, తార్నాక, లోయర్ ట్యాంక్ బండ్, పద్మరావునగర్, ముషీరాబాద్,…